calender_icon.png 1 April, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగం పెంచిన రెస్క్యూ బృందాలు

28-03-2025 12:33:10 AM

ఎస్‌ఎల్‌బీసీలో కార్మికుల ఆనవాళ్ల కోసం జాగిలాలతో తనిఖీలు

నాగర్‌కర్నూల్, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయ టకు తీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. గురువారం సొరంగంలోని డేంజర్ జోన్ వద్ద దుర్వాసన మరింత పెరగడంతో కార్మికుల ఆనవాళ్లు దొరికే ఆస్కారం ఉన్నట్లు భావిస్తూ మరోసారి కేరళ జాగిలాలతో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. సహాయక చర్యలకు అడ్డుగా ఉం టున్న టీబీఎం యంత్రాలను థర్మల్ ప్లాస్మా కట్టర్ ద్వారా వేరు చేస్తూ లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపుతున్నారు. సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకోగా రెండు మృతదేహాలను బయట కు తీశారు. మరో ఆరుగురి కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌లో వేగం పెంచారు. గురువారం ప్రతేక అధికారి శివశంకర్ లోతేటి సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.