23-02-2025 10:36:57 AM
స్వరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు రంగంలోకి రెస్క్యూటిమ్లు
వెలికితీస్తున్న ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి బృందాలు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు శనివారం రాత్రి నుంచి రంగంలోకి దిగాయి. దోమలపెంట వద్ద సొరంగం ఇన్ లెట్ గుండా లోకో ట్రాక్ వాహనంలో ప్రవేశించిన రెస్క్యూ బృందాలు కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సహాయ చర్యల్లో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి రెస్క్యూ బృందాలు పాల్గొంటున్నాయి. ఆదివారం తెల్లవారుజామున నాటికి టన్నెల్ లోని ఊటనీరు, బురదను భారీ యంత్రాలు మోటార్ల సాయంతో బయటకు తోడీవేత ప్రక్రియ నడుస్తోంది. కార్మికులు చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు సహాయక బృందాలు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఆ మిషన్ కు ముందువైపున చిక్కుకొని ఉన్న ఎనిమిది మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో హైడ్రా కమీసినర్ రంగనాత్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావులో అనుక్షణం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు మరోసారి ఆదివారం సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్వరంగ మార్గంలో చిక్కుకున్న వారంతా ఇద్దరు ఇంజనీర్లు కాగా మరో ఇద్దరు సిస్టం ఆపరేటర్లు మరో నలుగురు కార్మికులు వీరే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంజనీర్లు మనోజ్ కుమార్, శ్రీనివాస్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సందీప్ సాహూ, జాక్ట కేస్, సంతోష్ సాహు, అంజు సాహూ, పంజాబ్ రాష్ట్రానికి చెందిన విక్సా సింగ్, సన్నీ సింగ్ లు ఉన్నారు.