calender_icon.png 3 March, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద హైటెన్షన్..!

02-03-2025 12:37:08 PM

సాయంత్రం ఘటనా స్థలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

మృతదేహాలను గుర్తించినప్పటికీ వెలికి తీసేందుకు ఎదురవుతున్న అడ్డంకులు. 

ముఖ్యమంత్రి రాకతో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఎస్ఎల్బీసీ టర్నల్(SLBC Tunnel) ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయట తీసేందుకు రెస్క్యూ టీం(Rescue Team) అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సాంకేతిక నిపుణుల సహాయంతో సుమారు 6 నుంచి ఎనిమిది మీటర్ల కిందికి బురదల్లో కార్మికుల అవశేషాలు ఉన్నట్లుగా రెస్క్యూ టీమ్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ వెలిగి తీసే క్రమంలో రెస్యూ టీం ఆపరేషన్(Rescue Team Operations) కి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత రెండు రోజుల క్రితమే బురదలో కూరుకుపోయిన మృతదేహాలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ స్వరంగంలోని పైకప్పు బాగం నుంచి నీటి ఊట, బురద నిర్విరామంగా పేరుకుపోతుండడంతో రెస్క్యూ టిమ్ సిబ్బందికి సహాయక చర్యల్లో ఆటంకాన్ని కలిగిస్తుంది. దీంతోపాటు టిబిఎం మిషన్ గ్యాస్ కట్టర్ల ద్వారా వీడి భాగాలుగా చేసిన షకలాలను బయటికి తీసుకువచ్చేందుకు కూడా లోకో ట్రైన్ అందుబాటులో లేకపోవడంతో కన్వెయర్ బెల్ట్ సాయంతో మాత్రమే పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కన్వీయర్ బెల్ట్ కూడా గత వారం రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ టీం పనిచేస్తుండడంతో ప్రమాదకర స్థాయిలో ఉందని రెస్క్యూటిమ్ బృందం పేర్కొంది.

దీంతో టర్నెల్ లో పేరుకుపోయిన బురదలోనే అతి కష్టం మీద ప్రయాణిస్తూ శకలాలను బయటికి చేరవేస్తున్నారు. దీంతోపాటు బురదను కూడా లోకో ట్రైన్ సహాయంతో బయటికి తరలిస్తున్నారు. 12 రకాల రెస్యూ టీం బృందాల్లో మొత్తంగా 800 మందికి పైగా టీం ఆపరేషన్లో పాల్గొనగా నాలుగు షిప్తులుగా పనిచేస్తున్నారు. మృతదేహాల ఆనవాళ్లు ఉన్న ప్రాంతంలో డ్రిల్లింగ్ వేస్తూ బురద మట్టిని తొలగించే క్రమంలో రెస్యూ టీం సిబ్బందికి ఆక్సిజన్ అందడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రిల్లింగ్ వేసే క్రమంలోనూ ఫైనాన్స్ బురద మరింత పడే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు తొమ్మిది రోజులుగా బురదలో పేరుకు పోయిన మృతదేహాలను వెలికితీసే క్రమంలో దుర్వాసన వెదజల్తోందని దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు రెస్క్యూటివ్ పేర్కొంది. ఆదివారం వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎస్ఎల్బిసి టర్నల్ సందర్శన కోసం సాయంత్రం రానున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో పోలీసులు దోమలపెంట ఏరియాలో హై అలెర్ట్ ప్రకటించారు. సుమారు నాలుగు మృతదేహాలను ఈ సాయంత్రానికల్లా వెలికి తీసే అవకాశం ఉన్నట్లు చెబుతున్న రెస్క్ టీం మరో నాలుగు వెలికి తీసేందుకు మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరో మూడు రోజులు కూడా పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.