27-03-2025 12:40:18 PM
హైదరాబాద్: భద్రాచలంలో కుప్పకూలిన భవనం(Bhadrachalam Building Collapse) వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 18 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్ కట్టర్, క్రేన్లు, పొక్లెయినర్లతో సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. నిన్నటి నుంచి శిధిలాల్లోనే తాపీమేస్త్రి ఉపేందర్ చిక్కుకుపోయారు. తాపీమేస్త్రి ఉపేందర్ ను కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉపేందర్ ను గుర్తించేందుకు సహాయక బృందాలు జాగిలాలను పంపాయి. ఉపేందర్ ను కాపాడాలని భవనం వద్ద కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి కామేశ్వరరావును శిథిలాల నుంచి సహాయక బృందాలు వెలికి తీశాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కామేశ్వరరావు మృతి చెందారు. సహాయక చర్యల్లో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం భద్రాచలంలో జీఫ్లస్ 5 భవన్ కూలిన విషయం తెలిసిందే.