calender_icon.png 25 February, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం.. వెనుదిరిగిన పుష్ కెమెరా బృందాలు

25-02-2025 01:20:58 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  టన్నెల్ 14 కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకున్నారు. అయితే చిక్కుకున్నవారిని వెలికి తీసేందుకు టన్నెల్ లోకి వెళ్లిన సహాయక బృందాలు 13.7 కిలోమీటర్ వరకు చేరుకున్నాయి. టన్నెల్ 10.95 కిలోమీటర్ వద్ద ఒకటిన్నర అడుగుల, 11.9 కిలోమీటర్ వద్ద రెండు అడుగుల ఎత్తులో నీరు చేరుకుంది.

13 కిలోమీటర్ వద్ద టీబీఎం వెనెకభాగం పరికరాలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. టీబీఎం వెనుక పేరుకున్న బురద, పనిచేయని కన్వేయర్ బెల్ట్ ఉన్నాయి. వంద మీటర్ల పూడిక తర్వాత 6 అడుగుల ఎత్తులో మట్టి, రాళ్లతో పూడిక, 14 కిలోమీటర్ వద్దే 8 మంది చిక్కుకుపోయారని సహాయక బృందాలు అచనా వేస్తున్నారు. ఎండోస్కోపిక్ రోబోటిక్ పుష్ కెమెరాలను తీసుకెళ్లినా ఫలితాలు దక్కలేదు. దెబ్బతిన్న టీబీఎం నుంచి పుష్ కెమెరా బృందాలు ముందుకెళ్లలేక వెనుదిగాయని అధికారులు పేర్కొన్నారు.