calender_icon.png 9 January, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు గనిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

09-01-2025 01:12:40 AM

* ఒక మృతదేహం గుర్తింపు

* మరో ఎనిమిది మంది కోసం గాలింపు

దిస్‌పూర్, జనవరి 8: అసాంలోని ‘ర్యాట్ హోల్’ బొగ్గు గనిలో చిక్కుకున్న వారి కోసం భారత సైన్యం రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నది. గనిలో వరదల కారణంగా గాలింపు చర్యలు క్లిష్టతరంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం మొత్తం తొమ్మిది మంది మైనర్లు గనిలో గల్లంతు కాగా, భారత సైన్యం ఇప్పటివరకు ఒక మైనర్ మృతదేహాన్ని గుర్తించింది.

ఆమెను నేపాల్‌కు చెందిన గంగా బహదూర్ శ్రేష్ఠోగా గుర్తించారు. గనిలో లోతు 300 అడుగులు ఉండగా, ప్రస్తుతం 100 మీటర్ల మేర నీరు ఉంది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భారత సైన్యంతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు కూడా పాలుపంచుకుంటున్నాయి.