calender_icon.png 26 October, 2024 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణాలను రీషెడ్యూల్ చేయండి

26-10-2024 01:21:30 AM

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిని కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): గత సర్కారు చేసిన అధిక అప్పుల కారణంగా ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఒడిదొడులకు లోనవుతుందని, ఖజానాపై వడ్డీల భారాన్ని తగ్గించేందుకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిని నాగరాజు మద్దిరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.

శుక్రవారం ఢిల్లీలో భట్టి విక్రమార్క, నాగరాజు మద్దిరాల భేటీ జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖలో తెలుగు వ్యక్తి నాగరాజు కీలక పదవిలో ఉండటంపై భట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మద్దిరాలకు తెలంగాణ ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ఫైనాన్స్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన గ్రాంట్లు, ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావాల్సిన నిధుల విషయాన్ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దృష్టికి భట్టి తీసుకెళ్లినట్లు తెలిసింది.

కేసీ వేణుగోపాల్‌తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ..

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ ఇచ్చిన కులగణన హామీని రాష్ట్రంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.