calender_icon.png 5 November, 2024 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు రీషెడ్యూల్

04-11-2024 04:02:00 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మూడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నిక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13వ తేదీన పలు అసెంబ్లీ స్థానాలకు జరుగాల్సిన ఉపఎన్నికలను నవంబర్ 20కి రీషెడ్యూల్ చేయబడ్డాయి. ఈసీ మొదట ఈనెల 13న ఉపఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.

అయితే బీజేపీ, ఐఎన్సీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలతో సహా పార్టీలు ఎన్నికల కమిషన్‌ను ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి. నవంబర్ 13న పెద్ద ఎత్తున సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని ఈసీకి తెలిపారు. వారి అభ్యర్థన మేరకు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

పోలింగ్ రీషెడ్యూల్ చేయబడిన 14 స్థానాలు:

కేరళ: పాలక్కాడ్. 

పంజాబ్‌: డేరా బాబా నానక్, చబ్బర్వాల్, గిద్దర్‌బాహా, బర్నాలా.

ఉత్తరప్రదేశ్‌: మీరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, ఖైర్, కర్హల్, సిషామౌ, ఫుల్పూర్, కతేహరి, మఝవాన్.