calender_icon.png 30 January, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత సమస్యలపై మంత్రికి వినతి

29-01-2025 12:14:47 AM

యాదాద్రి భువనగిరి జనవరి 28 ( విజయక్రాంతి ) : చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేనేత సహకార సంఘాల నాయకులు మంగళవారం సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి వినతి పత్రం అందజేశారు.

సంఘాల క్యాష్ క్రెడిట్ వ్యక్తిగత రుణాలు మాఫీ చేసి ట్విప్టు పండు పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి చేనేత సహకార సంఘం చైర్మన్ గర్దాసు బాలయ్య, తెలంగాణ పద్మశాలి సంఘం చైర్మన్ కమ్మర్తకు మురళి, గుండాల సహకార సంఘం అధ్యక్షులు ఉప్పలయ్య, చౌటుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షులు కందిగట్ల బిక్షపతి, కోయలగూడెం చేనేత సహకార సంఘం అధ్యక్షులు కుల సంఘాల నాయకులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.