28-03-2025 12:00:00 AM
కల్లూరు, మార్చి 27:- సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఒక్క సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోనే డయాలసిస్ సెంటర్ ఉంది.పెనుబల్లి, కల్లూరులో కూడా కొత్తగా 50 పడకల ప్రభుత్వం అస్ప్రతి నిర్మాణం జరుగుతుంది.
వాటిలో కూడా డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లయితే పెసెంట్స్ కు డయాలసిస్ బాధితులకు ఉపయోగపదుతుందనిశాసనసభ లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రభుత్వానికి తెలియజేశారు. పేసెంట్లు ఎక్కువగా ఉండటం వలన సత్తుపల్లి సెంటర్ సరిపోవడం లేదు ప్రారంబానికి తయారు అవుతున్న ఈ రెండు మండలాల డయాలసిస్ సెంటర్ లను ఏర్పాటు చెయ్యాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను,సంబందిత అధికారులని కలిసి వివరించడం జరిగింది.