calender_icon.png 19 March, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి సమస్య పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

19-03-2025 12:35:13 AM

మేడ్చల్, మార్చి 18(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని బిజెపి నాయకులు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి విన్నవించారు. బిజెపి నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, కానుగంటి వంశీ వంజరి తదితరులు తాగునీటి సమస్యను వివరించారు.

మిషన్ భగీరథ రాకముందు బర్మాజిగూడ నుంచి నీటి సరఫరా జరిగేదని, దానిని పునరుద్ధరించాలని కోరారు. కీసర, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా లో ఇబ్బంది ఎదురైందని, త్వరలో నీటి సమస్య పరిష్కరి స్తామని కమిషనర్ హామీ ఇచ్చారని పాతూరి సుధాకర్ రెడ్డి తెలిపారు.