11-03-2025 12:52:01 AM
ఖమ్మం, మార్చి 10 (విజయక్రాంతి): ఖమ్మం రూరల్ మండలం లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ను కలిసి రైతు సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు.
అనంతరం రైతులు తో కలిసి నేరుగా జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి సమస్యలను వివరించారు.రైతులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వారికి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో పాటు రూరల్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య ఇతర నాయకులు ఉన్నారు.