calender_icon.png 15 May, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాసుబుక్ ఇప్పించాలని కలెక్టర్‌కు వినతి

22-04-2025 12:38:43 AM

కోదాడ ఏప్రిల్ 21: ప్రభుత్వ సీలింగ్ అసైన్డ్ పట్టా భూమికి కొత్త పాసుబుక్కుని మంజూరు చేయగలరని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు చాగంటి ఉపేంద్రమ్మ వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం మండల పరిధిలోని శాంతినగర్ గ్రామంలో భూభారతి అవగాహన సదస్సు హాజరైన కలెక్టర్ ను కలిసిన చాగంటి ఉపేంద్రమ్మ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా సీలింగ్ భూమిపై సేద్యం చేసుకుంటూ ఉన్నామని పట్టా ఉన్నప్పటికీ కొత్త పాస్బుక్ రాకపోవడం వల్ల ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా లాంటి సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదని నన్ను ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్ చొరవ చూపి భూభారతి లో కొత్త పాసుబుక్కుని మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రo ద్వారా కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఉపేంద్రమ్మ అందజేసిన వినతి పత్రంపై సత్కారమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారనీ తెలిపారు.