10-03-2025 04:54:39 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): సింగరేణి అధికారులు నిర్వాసిత గ్రామాలైన బట్వాన్పల్లి, పెరికపల్లి, ఆకెనపల్లి, లింగాపూర్, తాళ్ల గురిజాల, గ్రామాలలో రెండవసారి శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ కుమార్ కు బెల్లంపల్లి మండల రైతులు వినతి పత్రం అందజేశారు. ఈనెల 6న బెల్లంపల్లిలోని శాంతిఖని గని ఆవరణలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నిర్వాసిత గ్రామ రైతులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించకుండా పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితో అడ్డుకున్నారని వినతి పత్రం పేర్కొన్నారు. కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో నిర్వాసిత రైతులు సింగతి కిరణ్ కుమార్, కందుల రాకేష్ కుమార్, ఆకిరెడ్డి శంకర్, గోమాస శ్రీనివాస్, తొంగల మల్లేష్, సింగతి నరేందర్, గోమాస వినోద్, అచ్చె శివ తదితరులు ఉన్నారు.