calender_icon.png 22 November, 2024 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిని కాపాడాలని తహసీల్దార్ కు వినతి

22-11-2024 03:01:20 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా కాపాడాలని కోరుతూ శుక్రవారం ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ లు తహసిల్దార్ జ్యోత్స్యకు వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ భూములు యదేచ్చగా కబ్జా అవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా రూ.20 లక్షల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించారని పేర్కొన్నారు. రెండవ వార్డులో గల అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన భూమిని కూడా కబ్జా చేసినట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా జరుగుతున్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అధికారులు తీసుకున్న చర్యలపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరేపల్లి రమేష్, సతీష్ లు పాల్గొన్నారు.