26-04-2025 02:58:58 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): శ్రీ కాకతీయ బోర్డుతో శ్రీ చైతన్య పాఠశాల పేరు చెబుతూ తల్లిదండ్రుల నుండి 25, 26 విద్యా సంవత్సరానికి ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల విద్యాధికారి శ్రీనివాస్ కి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రాము యాదవ్ శనివారంవింత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ్ యాదవ్ మాట్లాడుతూ... శ్రీ కాకతీయ పాఠశాలలో శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర 2025-26 విద్యా సంవత్సరానికి ఫీజులు వసూలు చేస్తూ ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని ఆరోపించారు. పీఆర్ఓలను ఏర్పాటు చేసుకొని గ్రామాలలో అమాయక తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు.
పాఠశాల యజమాన్యం పాఠశాల బోర్డుపైన ఎలాంటి రసీదు లేకుండా ఫీజు చెల్లించవద్దని శ్రీ చైతన్య యజమాన్యం పెట్టారని. అయినప్పటికీ సదురు పాఠశాల ప్రిన్సిపాల్ ఫీజులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే శ్రీ కాకతీయ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో మరికొన్ని పాఠశాలలు పెద్ద పెద్ద హోల్డింగ్ లు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నారని వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని, లేని యెడల ఏఐఎస్ఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రాపల్లి రోహిత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.