calender_icon.png 1 May, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్లకు ఇరువైపులా మట్టి వేయాలని వినతి

09-04-2025 03:41:50 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తాండూర్ మండలంలోని కిష్టంపేట, తంగళ్ళపల్లి గ్రామాలలో చేపడుతున్న సీసీ రోడ్లకు ఇరువైపులా మట్టి వేయాలని కోరుతూ టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్ బుధవారం ఎంపీడీవో శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. సీసీ రోడ్లను పూర్తి చేసి మట్టి వేయకపోవడంతో వాహనాలు వెళ్ళలేని పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో పూర్తి చేసిన సిసి రోడ్లకు ఇరువైపులా మట్టిని వేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రజలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలలో కూడా నూతనంగా సిసి రోడ్లను చేపట్టాలని వినతిపత్రంలో కోరారు.