09-03-2025 08:45:30 PM
కొండపాక: తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక మండలంలో పలు గ్రామాల చెరువులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావుకు రైతులు వినతిపత్రం అందజేశారు. తపాస్ పల్లి డి ఫోర్ కాల్వ ద్వారా మండలంలోని పలు గ్రామాలకు గతంలో చెరువులను నింపారని ప్రస్తుతం నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. ఈ విషయంలో ఎంపీ రఘునందన్ రావు సంబంధిత అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయాలని చెప్పినట్టు వారు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల రైతులు నాయకులు ఎంపీ ని కలిసామని తెలిపారు .