calender_icon.png 31 January, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూరిబాబుపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు వినతి

31-01-2025 05:21:24 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లిలో దళిత మహిళ అధికారి జ్యోత్స్నపై అనుచితంగా వ్యవహరించిన మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని బి.ఆర్.ఎస్.వి జిల్లా అధ్యక్షులు బడికెల శ్రావణ్ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి రెండవ వార్డులో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు వెళ్లిన దళిత తహసిల్దార్ పై సూరిబాబు అనుచితంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన వాళ్ల నిర్మాణాలు ఎలా కూల్చే స్తావంటూ అమర్యాదగా మాట్లాడారని పేర్కొన్నారు. వెంటనే సూరిబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఆడెపు అరుణ్, అలీ భాయ్, సబ్బని అరుణ్, మద్దెల గోపి, దాసరి సతీష్, రంగ మహేష్, దాగం చరణ్, టి. శ్రీనివాస్, రోషన్, సురేష్ లు పాల్గొన్నారు.