calender_icon.png 27 November, 2024 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డీఓకి వినతి

06-11-2024 01:08:58 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో గల SRSP ప్రధాన కాలువను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొంత మంది ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ బుధవారం హుజూరాబాద్ ఆర్డిఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి SRSP కి సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని ఇండ్లు నిర్మాణాలు చేపడుతున్నారని ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేశారు.

ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పలు నిర్మాణాలు చేపడుతున్నారని అట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తక్షణమే సదురు నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని లేని పక్షంలో ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ సంబంధిత ఉన్నతాధికారులను సంబంధిత శాఖ మంత్రిని కలుస్తామని కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని అవసరాలకు, వివిధ శాఖల కార్యాలయాలకు కేటాయిస్తే నియోజకవర్గ ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.