బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో గల బస్తీ దవాఖానాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని బుధవారం కాంగ్రెస్ నాయకులు రామగిరి మహేష్ కుమార్ ఆర్డిఓ హరికృష్ణకు వినతి పత్రం అందజేశారు. బస్తీ దవాఖానాలో వైద్య సిబ్బంది పెంపుపై కూడా దృష్టి సారించాలని ఆయన వినతి పత్రంలో ఆర్డీవోలు కోరారు. మహేష్ కుమార్ వెంట నాయకులు మంతెన లక్ష్మణ్ ఉన్నారు.