calender_icon.png 19 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువులకు రక్షణ కల్పించాలని వినతి

19-04-2025 08:16:28 PM

మంచిర్యాల (విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండను తక్షణమే ఆపాలని, హిందువులకు రక్షణ కల్పించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి సంభోదిస్తూ మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షురాలు కనకతార, జిల్లా కార్యదర్శి వేముల రమేష్, జిల్లా గోరక్ష ప్రముఖ్ రాజసమ్మయ్య, జిల్లా సత్సంగ్ ప్రముఖ్ సురేష్, మాతృ శక్తి సంయోజక ముత్యం పద్మ, నగర సహకార్యదర్శి విద్యాసాగర్, హిందూ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు బోయిన హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.