calender_icon.png 3 April, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

27-03-2025 07:01:05 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని వ్యాపార సముదాయాలలో ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం నాడు ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మహేష్ కు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు మర్లు సాయిబాబా ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్లాస్టిక్ కవర్ల వాడకం వలన పర్యావరణం కలుషితమవుతుందని, ఇటీవల ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ప్లాస్టిక్ కవర్ల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మనం ఉపయోగించి పారవేసిన ప్లాస్టిక్ భూమిలో కరిగి పోవడానికి ఎన్నో సంవత్సరాల కాలం పడుతుందని దాని వలన భూ కాలుష్యం ఏర్పడుతుందని, కాలువల ద్వారా చెరువులలో, నదులలో, సముద్రాలలో ప్లాస్టిక్ చేరి నీటి కాలుష్యానికి దారికి తీస్తుందన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనార్థాల గురించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జ్యూట్ బ్యాగులను ఉపయోగించే విధంగా అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని వ్యాపార సముదాయాలలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించి ప్లాస్టిక్ రహిత ఎల్లారెడ్డిగా మార్చడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తూ స్వచ్ఛ ఎల్లారెడ్డిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ పరిరక్షణ సమితి జిల్లా సలహాదారు లింగమయ్య, సాయికుమార్ వేముల భాను తదితరులు పాల్గొన్నారు.