05-03-2025 08:58:12 PM
మొగుడంపల్లి/ సంగారెడ్డి (విజయక్రాంతి): గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో మహేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈరోజు మొగుడంపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో వారు ఈ వినతిపత్రాన్ని సమర్పించారు. గత ఆగష్టు నుండి పెండింగ్‌లో ఉన్న చెక్కులు విడుదల కాకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయని, నిధుల కొరత వల్ల అవసరమైన సామగ్రి, డీజిల్ సరఫరా నిలిచిపోయిందని వారు తెలిపారు. అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభించేందుకు నిధులను త్వరగా విడుదల చేయాలని ఎంపీడీఓను కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శిలు వెంకట్ రెడ్డి, మారుతి, సందీప్, రాంప్రసాద్, సంతోష్, నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.