calender_icon.png 16 January, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓసి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఎమ్మెల్యేకి వినతి

16-01-2025 06:39:03 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు సింగరేణి  జేకే 5 ఓపెన్ కాస్ట్ విస్తరణ చేస్తున్న నేపథ్యంలో విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ పంచాయితీలలో ఇండ్లు, ఇళ్ల స్థలాలు వ్యవసాయ సాగుభూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూ నిర్వాసిత చట్టం-2013 ప్రకారం పరిహారం చెల్లించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) కు అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందజేశారు. ఓసి ప్రభావిత ప్రాంతంలో సింగరేణి సీఎస్ఆర్ నిధులు వెచ్చించి అభివృద్ధి పర్చాలని, పూర్తిగా నిర్వాసితులైన వారికి 21 పిట్ సింగరేణి ఎక్స్ప్లోసివ్ మ్యాగ్సిన్ ప్రాంతంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, 21పిట్ క్వార్టర్స్ లో నివసిస్తున్న వారికి, స్వంత స్థలాలు, ఇళ్ళు ఉన్నవారికి పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని త్రాగునీరు, రోడ్లు, సైడ్ కాలువలు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మెరుగైన ప్యాకేజీ కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడి ప్రజలకు నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని 21 పిట్ అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్యకి వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.సారయ్య, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అబ్దుల్ నబి, స్థానిక తాజా మాజీ ఎంపీటీసీ పూణేమ్ సురేందర్, సిపిఐ నాయకులు మంచాల వెంకటేశ్వర్లు, వడ్ల శ్రీనివాస్ సూరపాక సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు ఎట్టి హరికృష్ణ, దనసరి రాజు, టీడీపీ క్లింట్ రోచ్, గూళ్ళ మొగిలి, బీఆర్ఎస్ నేత సదరం మహేష్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ లాలు, గూళ్ళ సదయ్య, సుందర్ తదితరులు పాల్గొన్నారు.