calender_icon.png 1 April, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈద్గా నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

29-03-2025 08:51:38 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామ ముస్లిం పెద్దలు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రంజాన్ పండుగ నాడు ఈద్గా నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కుల పెద్దలు, యువత పాల్గొన్నారు.