calender_icon.png 28 February, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ మేడారంలో శాశ్వత విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

27-02-2025 09:26:09 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంతో గూడెం గ్రామంలో మినీ మేడారం(MLA Payam Venkateswarlu)గా విరాజిల్లుతున్న శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ(Sammakka Saralamma Temple) పరిసరాల్లో శాశ్వత విద్యుత్ దీపాలను విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని ఆలయ పూజారులు కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu)ను కలసి వినతి పత్రం అందజేశారు. సమ్మక్క సారలమ్మ ఆలయంలో జాతర సమయంలో మాత్రమే కాకుండా ఇతర రోజుల్లోనూ భక్తుల తాకిడి పెరుగుతోందని ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంతంలో శాశ్వత ఫ్లడ్ లైట్ల అవసరం ఉంటుందన్నారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా మినీ ట్రాన్స్ ఫార్మర్ కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారమ్మలు పరిశిక రాజమ్మ, ఆలయ కమిటీ సభ్యులు ఉకే వీరయ్య, కొమరం వెంకటేశ్వర్లు, మడకం శ్రీనివాసరావు, మడకం గోపమ్మ, సరిత, నాగలక్ష్మి, సింగం అచ్చమ్మ, నిర్మల, సీత, ఉకే మంగ, నాగలక్ష్మి, హర్షిక రమణ, వర్షా శ్రీను, రమేష్  తదితరులు పాల్గొన్నారు.