calender_icon.png 1 February, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిబ్లాక్ నుంచి బాడీ లారీలకు బొగ్గు ఇవ్వాలని జిఎంకు వినతి

01-02-2025 07:56:41 PM

రెండు సంవత్సరాల నుండి ఉపాధి లేక వలసబోయిన కార్మికులు..

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు సింగరేణి జెకె ఫై ఓసి డిబ్లాక్, వే బ్రిడ్జి దగ్గర పనిచేస్తున్న 72 మంది కాటా కార్మికులకు, ఇల్లందులో బొగ్గు లేకపోవడం వలన కార్మికులు పరిస్థితి దీనావస్థకు చేరిందని తెలుపుతూ ఏఐటీయూసీ, టీయుసిఐ, జాయింట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఇల్లందు జిఎం వీసం కృష్ణయ్యకి వినతిపత్రం అందజేశారు. బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ హైమద్, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు షేకియాకుబ్ షావలి దేవరకొండ శంకర్లు జీఎంకు వివరిస్తూ ఇల్లందులో ఓపెన్ కాస్ట్ బొగ్గు లేకపోవడం వలన, జెకె 5 ఓసి వేబ్రిడ్జి నుండి, బాడీ లారీలకు బొగ్గులోడు లేకపోవడం వలన, ఈ లారీలపై ఆధారపడే మూడు షిఫ్ట్ లలో పని చేసే 72 మంది కార్మికులతో పాటు కోల్ ట్రాన్స్పోర్ట్ గుమస్తాలు డ్రైవర్లకు ఉపాధి లేక అడ్డమీది కూలీలుగా వలస పోయారన్నారు. జిఎం జోక్యం చేసుకొని, ఇల్లందు డి బ్లాక్ నుండి బొగ్గు యాక్షన్ లో పెడితే షిఫ్ట్ రెండు లారీలు లోడ్ ఇస్తే కార్మికులకు ఉపాధి కలుగుతుందన్నారు. జిఎం సానుకూలంగా స్పందిస్తూ మార్చి వరకు ఇల్లందులో బాడీ లారీలకు బొగ్గు ఇచ్చే విధంగా బొగ్గు యాక్షన్ లో పెడతామని తెలియజేశారు. కార్మిక నాయకులతో వచ్చిన ఖాటా కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ జిఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు బంధం నాగయ్య, పాయం వెంకన్న, నెల్లి కొమరయ్య, షేక్ యాకుబ్ పాషా, వెంకన్న, కృష్ణ, సైదులు పాల్గొన్నారు.