మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): భోలక్పూర్ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్ ను మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. రంగానగర్, ఇందిరా నగర్, తాజీర్ ల్ నగర్ సిద్ధిక్ నగర్, నవాబ్ సబ్ వీధి, గుల్షన్ నగర్ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రోడ్లను వెంటనే ఆధునికరించాలని కోరారు. ఇందిరానగర్ ఫస్ట్ వెంచర్ లో అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జోనల్ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రహీముద్దీన్, నియాజ్ అహ్మద్, అస్లాం, ముజీమ్ హుస్సేన్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.