calender_icon.png 25 February, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని వినతి

20-02-2025 01:07:45 AM

హుజురాబాద్, ఫిబ్రవరి19: ప్లాస్టిక్ నీ అరికట్టాలని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపల్ ప్రత్యేక అధికారి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయికి ప్లాస్టిక్ పరిరక్షణ కమిటీ బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్  పట్టణంలో యదేచ్చగా ప్లాస్టి క్ వాడుతున్నారని ప్లాస్టిక్ ను అరికట్టేందుకు కృషి చేయాలని కోరారు.

క్లాసిక్ వాడడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ బారినపడి ఇబ్బం దుల గురవుతున్నారన్నారు. 20 22లో చట్టం ప్రకారం ప్లాస్టిక్ నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.

ఆర్టీసీ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, నరసయ్య, సంజీవ్, రాజమౌళి తో పాటు తదితరులు పాల్గొన్నారు.