calender_icon.png 21 January, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్లను నరికి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి

20-01-2025 08:52:41 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పెరిగిన చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్(District Collector Deepak Kumar) కు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, బెల్లంపల్లి మండల బి.ఆర్.ఎస్ అధ్యక్షులు సింగం గణేష్ గౌడ్ లు వినతిపత్రం అందజేశారు. పది సంవత్సరాల కిందట హరితహారంలో భాగంగా పెట్టిన 24 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికేశారని పేర్కొన్నారు. కాలుష్య నివారణ కోసం చెట్లను పెంచాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ పెరిగిన చెట్లను నరికి వేయడం చట్టరీత్య నేరంగా భావించాలని పేర్కొన్నారు. బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నుండి ఒక ట్రాక్టర్ లోడ్ పాత కలప దుంగలు కూడా అక్రమంగా తరలించినట్లు కలెక్టర్ కు అందజేసిన వినతిపత్రంలో వారు పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో పచ్చని చెట్లను నరకడంతో పాటు కార్యాలయంలోని కలపను తరలించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.