calender_icon.png 18 March, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిఖని ప్రాజెక్టు రద్దు చేయాలని సి అండ్ ఎండి కి వినతి

17-03-2025 10:15:33 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతిఖని లాంగ్ వాల్ 2 ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ సోమవారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సింగరేణి సంస్థ సి అండ్ ఎండి బలరాం నాయక్ కు నిర్వాసిత రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టు విస్తరణ వల్ల బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి, పెరిక పల్లి, ఆకెనపల్లి, లింగాపూర్, తాళ్ల గురిజాల గ్రామాలలో భూగర్భజలాలు అడుగంటిపోయి ప్రజల జీవన ఆధారమైన వ్యవసాయానికి సాగునీరు అందని పరిస్థితి తలెత్తుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. రైతులకు నష్టం కలిగించే శాంతి ఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ 2 ను రద్దుచేసి నిర్వాసిత గ్రామాలను కాపాడాలని వినతిపత్రంలో రైతులు కోరారు. సి అండ్ ఎండి బలరాం నాయకులు కలిసిన వారిలో లాంగ్ వాల్ ప్రాజెక్ట్ 2 వ్యతిరేక కమిటీ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు రామగొని అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సింగత రవి, గౌరవ అధ్యక్షులు గోమాస శ్రీనివాస్, సంగతి కిరణ్ తదితరులు ఉన్నారు.