calender_icon.png 30 April, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిని విడుదల చేయాలని అధికారులకు వినతి

30-04-2025 06:56:21 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం ఖానాపూర్ మండలాలకు సాగునీరు అందించే సదర్ మార్ట్ బ్యారేజ్ నుండి నీటిని విడుదల చేయాలని కోరుతూ బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షులు రితీష్ రాథోడ్ బుధవారం నీటిపారుదల శాఖ అధికారులకు వినతిపత్రం అందించారు. యాసంగిలో సదర్ మార్ట్ ఆయకట్టు కింద వరి పంటలు సాగు చేసుకున్న రైతులకు ప్రస్తుతం నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోతున్నాయని అధికారులు వెంటనే నీటి విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని హైదరాబాద్ నీటిపారుదల శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందించినట్లు ఆయన తెలిపారు.