calender_icon.png 11 March, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టళ్లలో స్టాఫ్‌నర్స్‌ను నియమించాలని వినతి

11-03-2025 12:59:43 AM

ఎల్లారెడ్డి, మార్చి 10 (విజయక్రాంతి) ః కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎస్.సి,బి.సి వసతి గృహాలలో విద్యా ర్థులు అనారోగ్యం బారిన పడినప్పుడు స్టాఫ్ నర్స్ అందుబాటులో లేకపోవడంతో తీవ్రమైన ఇబ్భందులను ఎదుర్కోవాల్సి వస్తుం దని, స్టాఫ్‌నర్స్‌ని నియమించాలని కోరు తూ తహశీల్ కార్యాలయంలో సోమవారం నాడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బి.సి.సంఘ నాయకులు లింగమ య్య, బి.ఎస్. పి. నాయకులు సాయిబాబా పిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అకస్మాత్తుగా అనారోగ్యం బారినపడి కడుపునొప్పి, జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చినప్పుడు పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పంపిస్తున్నారని, స్వల్ప అనారోగ్య సమస్యలకే విద్యార్థులు ఇంటి బాట పట్టడంతో వారి చదువుకు ఆటంకం కలుగుతుందని ఆరోపించారు.కావున విద్యార్థుల శ్రేయస్సు, సౌక ర్యార్థం వెంటనే హస్టల్ లలో స్టాఫ్ నర్స్ ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయిందని,పిల్లల రక్షణ కోసం తగిన చర్యలు తీసు కోవాలని అన్నారు. వసతి గృహాలలో రెగ్యులర్ వార్డెన్ లను నియమించాలని కోరారు.