25-03-2025 05:05:53 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): ఎస్సీ కార్పొరేషన్ కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకొని ఎంపికై సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం వెంటనే రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళవారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో నిరుద్యోగుల తరఫున బెల్లంపల్లికి చెందిన గోమాస వినోద్ అనే యువకుడు అధికారులకు వినతి పత్రం అందజేశారు. బెల్లంపల్లి మండలంలోని 14 మంది ఎంపికైన ఎస్సీ నిరుద్యోగులకు వెంటనే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించాలని వినతిపత్రం ప్రభుత్వాన్ని కోరారు.