calender_icon.png 19 April, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనం కోసం వినతి

19-04-2025 01:12:15 AM

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

పెబ్బేరు ఎప్రిల్ 18: విశ్వబ్రాహ్మణ సం ఘం సామాజిక భవనం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ని శుక్రవారం పెబ్బేరు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు నాగభూషణం కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో స్వర్ణకారుల సంఘం కు సామాజిక భవనం ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే స్థలాన్ని కెటాయించాలని కోరారు.

గత పది సంవత్సరాల నుండి పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని వారు అన్నారు. అం దుకు ఎమ్మెల్యే స్పందిస్తూ స్థలంలో పాటు, భవనానికి కూడా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అధ్యక్షుడు నాగభూషణం కు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, కౌన్సిలర్ బ్రహ్మం, వర్కింగ్ ప్రెసి డెంట్ వెంకటేష్ సాగర్, స్వర్ణకారుల సంఘం నాయకులు శ్రీనివాస చారి, జానకి రాము లు, శివశంకర్, మాధవాచారి తదితరులు పాల్గొన్నారు.