calender_icon.png 19 April, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాలలో భూగర్భ డ్రైనేజీకై వినతి

05-04-2025 12:00:00 AM

కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి  శ్రీనివాస్’ను కలిసిన ఎమ్మెల్యే సంజయ్ 

జగిత్యాల, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): జిల్లా కేంద్రమైన జగిత్యాలలో భూగర్భ డ్రైనేజీకి నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి  శ్రీనివాస్ కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వినతి పత్రం అందజేశారు. శుక్రవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు.

జగిత్యాల పట్టణ అభివృద్ది పనులపై చర్చించారు. జగిత్యాల పట్టణం జిల్లాగా ఏర్పడ్డ తర్వాత జిల్లా కేంద్రం త్వరిత గతిన నలువైపులా అవృద్ధి చెందుతూ విస్తరిస్తుందన్నారు.  నిధుల మంజూరుకు  సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, బిజెపి సీనియర్ నాయకులు మోరపల్లి సత్యనారాయణ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి, అధికారులు పాల్గొన్నారు.