calender_icon.png 17 January, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలి

16-01-2025 11:37:22 PM

సింగరేణి ఏరియా జిఎం దేవేందర్...

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలని సింగరేణి ఏరియా జిఎం దేవేందర్ అధికారులను ఆదేశించారు. ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో పలు విభాగాల అధికారులతో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిఎం మాట్లాడుతూ.. పట్టణంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో వైభవంగా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రామదాసు, డివైజిఎం ఈఅండ్ఎం వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డీజీఎం ఐఈడి రాజన్న, సివిల్ ఎస్ఈ రాము, పలు డిపార్ట్మెంట్ల అధికారులు, అన్ని గనుల మేనేజర్లు పాల్గొన్నారు.