calender_icon.png 18 January, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిపబ్లిక్ డే రోజు 4 పథకాలు

18-01-2025 01:14:31 AM

* ఉగాది నుంచి సన్న బియ్యం 

* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం, జనవరి 17 (విజయక్రాంతి): ఇచ్చిన మాట ప్రకారం రిపబ్లిడే నుంచి   అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్‌కార్డుల జారీ పథకాలను ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం నగరంలోని బల్లేపల్లి, జయనగర్‌కాలనీ ప్రాంతాల్లో పర్యటించి, సీసీ రోడ్లకు, సైడ్ డ్రైన్లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి దశలో అత్యంత పేదలకు ప్రభుత్వ సహాయం అందుతుందని, తర్వాత దశల వారీగా అర్హులందరికీ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లాలో 60 ఉన్నత పాఠశాలలో  స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులు ప్రవేశపెట్టామని చెప్పారు.

ఖమ్మం , వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టామన్నారు. ఖమ్మం  రోప్ వే ఏర్పాటుకు రూ.30 కోట్లతో  పనులు చేపట్టామని చెప్పారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి అన్నారు. ఖమ్మంతో పాటు కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంతాల్లో అర్బన్ పార్కుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పార్క్‌ల వద్ద ప్లాస్టిక్  వాడకం నిషేధించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఆర్డీవో నరసింహారావు, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ పాల్గొన్నారు.