మాజీ మంత్రి జోగు రామన్న...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ డాక్టర్ అంబేద్కర్ ఆలోచన వారి మేధాశక్తి కి నిలువెత్తు నిదర్శనం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలని కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వం, స్వేచ్ఛ హక్కును కల్పించిన ఘనత బీఆర్ అంబేద్కర్ అని తెలిపారు. నేడు ఆ మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు.