బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలకు బీఆ ర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అందించిన హక్కులను ప్రతీ పౌరుడికి దక్కేలా రాజ్యాంగం మరింత ప టిష్ఠంగా అమలు కావాలని శనివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రా జ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చేందుకు పాలకులు మరింత కృషి చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వా మ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతలకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. స్వేచ్ఛ, స మానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాద విలువలను అనుసరిస్తూ, వాటి స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతీఒక్కరం ప్రతినబూనుదామన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాజ సాధన కోసం పాలకులు పాటుపడాలన్నారు.