మందమర్రి (విజయక్రాంతి): పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవ్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజ్యాంగం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈ దేశానికి దిక్సూచి అని సూచించారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కులను, విధులను ప్రసాదించిందని వాటిని తెలుసుకొని నడుచుకోవాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్, క్లబ్ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు.