మందమర్రి (విజయక్రాంతి): 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని సంజయ్ గాంధీ విగ్రహ ప్రాంగణం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొతుకు సుదర్శన్, గుడ్ల రమేష్, పుల్లూరి లక్ష్మణ్, కడారి వీరస్వామి, కడలి శ్రీనివాస్ లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెరవేట్ల శ్రీనివాస్, గడ్డం రజిని, మంకు రమేష్, మంద తిరుమల్ రెడ్డి, జమీల్, సుకూర్, ఎండి నయీమ్, శనిగరపు సాగర్, శ్రీకాంత్, మహంత్ అర్జున్, నర్సోజి, తదితరులు పాల్గొన్నారు.