మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ నివాసం వద్ద డీసీసీ అధ్యక్షురాలు సురేఖ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.