మంచిర్యాల (విజయక్రాంతి): 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అమీరిశెట్టి రాజ్ కుమార్, గాజుల ముఖేష్ గౌడ్, బియ్యాల సతీష్ రావు, తోట మల్లికార్జున్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, కొండవీటి తిరుమల, బెల్లంకొండ మురళి, నాగుల రాజన్న, బండి మల్లికార్జున్, బోయిని దేవేందర్, రెడ్డిమళ్ల అశోక్, ఆవిడపు రాజబాబు, బింగి సత్యనారాయణ, దేవరకొండ వెంకన్న, తూటి సరస్వతి, తరుణ్, చిట్యాల వెంకటేష్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.