మణుగూరు ఏరియా జిఎం రామచందర్...
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని పివి కాలనీ భద్రాద్రి స్టేడియంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏరియా అధికారులకు జిఎం దుర్గం రామచందర్ ఆదేశించారు. మంగళవారం పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియంను ఏరియా అధికారులతో కలిసి పరిశీలించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని తగిన సూచనలను చేశారు.
వేడుకలకు హాజరయ్యే పలు పాఠశాలల విద్యార్థులకు వేడుకలను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు, టెంట్లు, కుర్చీలు ఇతర సదుపాయాలను కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మణుగూరు ఏరియా ఎస్ఓటు జయం శ్యాంసుందర్, డీజీఎం సివిల్ డి వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ సలగల రమేష్, ఎస్ఈ (ఈ అండ్ ఎం) ఎన్ మధుసూదన్, సెక్యూరిటీ అధికారి కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.