calender_icon.png 27 January, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పినపాక నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2025 02:29:45 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు రాజా భవన్ కార్యాలయం తో పాటు వివిధ ఆర్గనైజేషన్లో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మెజిస్ట్రేట్ కె సూరి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన న్యాయవాదులకు నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన విజేతలకు మేజిస్ట్రేట్ సూరి రెడ్డి బహుమతులను అందజేశారు. 

మణుగూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి రవీందర్ రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా మణుగూరు పోలీస్ స్టేషన్లో సిఐ సతీష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మణుగూరు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రాఘవరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సింగరేణి కలర్స్ మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ జిఎం కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పివీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

సింగరేణి ఎస్ అండ్ పిసి సెక్యూరిటీ గార్డులు, సింగరేణి పాఠశాల తో పాటు మండల పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలను తిలకించారు. మండల విద్యాశాఖ కార్యాలయం మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ లలో ఎంఈఓ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసరావులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. వీరితోపాటు ఆయా పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించి జాతీయ జెండాలను ఆవిష్కరించారు.