క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోహిత్
మెదక్, జనవరి 26 (విజయక్రాంతి)ః మెదక్ జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లో త్రివర్ణ పతాకాన్ని అధికారులు ఆవిష్కరించారు. అలాగే మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, స్థానిక రాందాస్ చౌరస్తాలో ఎమ్మెల్యే రోహిత్‌రావు జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం హర్షణీయమని తెలిపారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడంతో రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకంగా నిలవనున్నట్లు ఆయన వర్ణించారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఆంజనే యులు గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అవుసుల భవాని, మెదక్ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్, బొజ్జ పవన్, అరునార్తి వెంకటరమణ, మున్సి పల్ చెర్మైన్ తొడుపు నూరి చంద్రపాల్, కౌన్సిలర్లు, పట్టణ, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాగా బీఆర్‌ఎస్ పార్టీ మెదక్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.