మందమర్రి,(విజయక్రాంతి): 76వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు పట్టణంలో మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, మహనీయులను స్మరించుకున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ కార్యాలయంలో మండల తహసిల్దార్ సతీష్ కుమార్ ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎఓ కిరణ్మయి, పోలీస్ స్టేషన్లో సీఐ శశిధర్ రెడ్డి, మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ సారా తస్నీమ్, ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, సింగరేణి ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్ శ్యామ్ సుందర్, పీహెచ్సీలో డాక్టర్ రమేష్,లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్ సెంటర్ లోని సంజయ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉపేందర్ గౌడ్,వివిధ వార్డుల్లో సీనియర్ నాయకులు సొత్కు సుదర్శన్, గుడ్ల రమేష్, ను జాతీయ పతాకాన్నీ ఆవిష్కరించారు.
బిఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు జే రవీందర్, బిజెపి జెండాల వద్ద సీనియర్ నాయకులు దీక్షితులు, దుర్గరాజు, టీడీపీ కార్యాలయంలో సంజయ్ కుమార్, వాసాల సంపత్, బీఎస్పీ కార్యాలయంలో ముల్కల రాజేంద్ర ప్రసాద్, జనసేన కార్యాలయంలో మాయ రమేష్, ఏఐటియుసీ కార్యాలయంలో బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, టీబీజీకే కార్యాలయంలో ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, సీఐటీయు కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి, ఏంటి సి కార్యాలయంలో కాంపల్లి సమ్మయ్య, సింగరేణి పాఠశాల ముందు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజిముద్దీన్, లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో ప్రత్యేకాది కారులు, కార్యదర్శులు, జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే పురస్కరించుకొని పట్టణంలోని కార్మిక కాలనీలు గ్రామాల్లోని ముఖ్య కూడళ్ళు మువ్వన్నల జెండాలతో రెపరెప లాడాయి.