బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం 75 వ గణతంత్ర వేడుకలను ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి కోర్టులో సివిల్ జడ్జి జె.ముఖేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో హరికృష్ణ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు జరుపుకున్నారు. బెల్లంపల్లి ఏసిపి కార్యాలయం, పాత బస్టాండ్ వద్ద ఏసీపి ఏ. రవికుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేసి సిబ్బందితో కలిసి వేడుకల్లో పాలుపంచుకున్నారు. జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో బజార్ ఏరియా పాఠశాల విద్యార్థులు 150 అడుగుల జాతీయ జెండాను పట్టణంలో ఊరేగిస్తూ ప్రదర్శన నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు మహనీయుల వేషధారణతో పలువురిని ఆకర్షించారు.